ప్రభాస్ ఫౌజీ మూవీ నిర్మాణ బృందంలో విషాదం నెలకొంది. ఈరోజు షూటింగ్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు.
షూటింగ్ కు వెళుతుండగా వాహనం అదుపుతప్పి డివైడర్ సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ఐదుగురికి గాయాలు...ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో సినిమా షూటింగ్ కి వస్తున్న వెహికల్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది.చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తూప్రాన్ పేట బ్రిడ్జికి ఢీ కొట్టారు.

