Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pradeep Ravath : సినీ పరిశ్రమలో విషాదం..గుండె పోటుతో ప్రదీప్ రావత్ మృతి

Pradeep Ravath : సినీ పరిశ్రమలో విషాదం..గుండె పోటుతో ప్రదీప్ రావత్ మృతి

TeluguPost.com 4 days ago

Mumbai : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అనేక సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు ప్రదీప్ సింగ్ రావత్ మరణించారు.హిందీలో 1985 లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు ప్రదీప్ రావత్.

ఈయన పూర్తిపేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. మధ్యప్రదేశ్ జబల్ పూర్ ఈయన స్వస్థలం. 2004 తెలుగులో రాజమౌళి - నితిన్ సై సినిమాలో విలన్ గా నటించి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ వెంటనే సూర్య గజినీ సినిమాలో కూడా విలన్ గా నటించి మరింత స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.

అనేక భాషల్లో నటించి...

అక్కడ్నుంచి వరుసగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో విలన్ గా నటిస్తూ వచ్చాడు, మధ్యమధ్యలో కొన్ని కమెడియన్ పాత్రలు కూడా చేసాడు ప్రదీప్ రావత్. సై సినిమాలో ఇతని నటనకు బెస్ట్ విలన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఛత్రపతి సినిమాతో రాజమౌళి ఈ నటుడికి మరింత ఫేమ్ ఇచ్చాడు. తెలుగులో చివరగా ఇటీవలే గాయపడ్డ సింహం సినిమాలో కనిపించి నవ్వించారు. ప్రదీప్ రావత్ మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu