Dailyhunt
పుట్టపర్తికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

పుట్టపర్తికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

TeluguPost.com 1 week ago

దేశ రక్షణ రంగ చరిత్రలో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం సరికొత్త మైలురాయిని చేరుకోబోతోంది. భారత్ గర్వపడేలా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి పుట్టపర్తి వేదిక కానుంది.

ఈ భారీ ప్రాజెక్టు వివరాలను వెల్లడించేందుకు బుధవారం పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు.

వెనకబడిన రాయలసీమ ప్రాంతాన్ని..."వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సుమారు లక్ష కోట్ల పెట్టుబడితో కూడిన ఈ ప్రాజెక్టును ఇక్కడికి తీసుకురావడం అభినందనీయం. ఈ గొప్ప అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌కు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు" అని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇలాంటి భారీ ప్రాజెక్టులు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టుకు 600 ఎకరాలు.. భూమి సేకరణ, ఇందులో మొదటి దశలో 150 సేకరణ దాదాపుగా పూర్తయిందని తెలిపారు.140 యుద్ధ విమానాలు...ఈ ప్రాజెక్ట్ కోసం డీఆర్డీవోకు సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించారని, ఇందులో రక్షణ రంగ దిగ్గజ సంస్థలైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ వంటి కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయని వివరించారు. ఈ కేంద్రంలో మొత్తం 140 యుద్ధ విమానాలను తయారు చేయాలన్నది లక్ష్యమని తెలిపారు. దీనివల్ల రాయలసీమ నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీనకేంద్ర రక్షణ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu