పుట్టపర్తి దేశం గర్వించే రక్షణ కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో జరిగిన డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గర్వకారణంగా ఉందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని చంద్రబాబు అన్నారు.
పారిశ్రామిక రంగంగా...ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయడం కోసం తమ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో ఏర్పాటు కాబోయే పరిశ్రమ కారణంగా ఏడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అవకాశాలు తాము కల్పిస్తామని, వాటిని అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపు నిచ్చారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ దేశానికే రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని అన్నారు. భవిష్యత్‌లో పుట్టపర్తిలో లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు.

