Karimnagar : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఓ ఇంటి వంటగది కిటికీ గుండా భారీ కొండచిలువ చొరబడింది. అది చూసిన కుటుంబ సభ్యులు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు.
వంటగదిలో శబ్దాలు విని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్నేక్ క్యాచర్ ...
అక్కడకు వెంటనే వచ్చిన బ్లూకోట్ పోలీసులు, స్నేక్ క్యాచర్ అఫ్జల్ ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. కొండచిలువను అటవీ శాఖ అధికారుల సంరక్షణలో అడవిలోకి వదలిపెట్టినట్లు సిబ్బంది తెలిపారు.

