Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rahul Gandhi : ఆర్థిక సంక్షోభం అంచున ఇండియా  : రాహుల్

Rahul Gandhi : ఆర్థిక సంక్షోభం అంచున ఇండియా : రాహుల్

TeluguPost.com 6 days ago

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక తుపాను దేశంలో రాబోతుందని రాహుల్ అన్నారు. సామాన్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనక తప్పదని రాహ ుల్ అన్నారు.

సామాన్యుడు అంతులేని భారాన్ని మోయాల్సిందేనని రాహుల్ చెప్పారు. భారతీయ సంపదను అంతా అంబానీ, అదానీలకు దోచి పెట్టి సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్నారు. వరసగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతుండటం అందులో భాగమేనని అన్నారు.

దేశ సంపదనంతా...

రానున్న కాలంలో మరింత సంక్షోభాన్ని దేశం ఎదుర్కొంటుందని, మోదీ మార్క్ పాలన అంటే ఇదేనంటూ రాహుల్ మండి పడ్డారు. దేశ ప్రజలను నిలువునా ముంచి సంపదను కొందరికే దోచి పెడుతూ మోదీ సామాన్య, మధ్య తరగతి ప్రజలను పట్టించుకోవడం ఎనాడో మానేశారంటూ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఆర్థిక సంక్షోభం అంచున దేశం ఉందని రాహుల్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu