Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rain Alert : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లావాసులు జాగ్రత్త

Rain Alert : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లావాసులు జాగ్రత్త

TeluguPost.com 1 week ago

Telangana : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రెండు రోజుల పాటు వానలు పడతాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు పడతాయని చెపపింది.

ఉపరితల ద్రోణి విస్తరించిన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని పేర్కొంది. అయితే ద్రోణి బలమీణ పడిందని, కానీ వానలు మాత్రం పడతాయని చెప్పింది. కొన్ని చోట్ల మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఏపీలో మోస్తరు వానలు...

ఆంధ్రప్రదేశ్‌లోనూ వానలు పడతాయని, మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థవిజయనగరం,విశాఖ,అల్లూరి,అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రధానంగా అరకు,చింతపల్లె,నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి,విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, పశువుల కాపర్లు విద్యుత్తు స్థంభాలు, చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం,కాకినాడ,కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన చోట్ల తేలిక పాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

క్యుములోనింబస్ మేఘాలతో...

తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణలో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది తొలగిపోయిందని అధికారులు చెబుతున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే తేలికపాటి, మోస్తరు వానలు మాత్రమే పడతాయని, భారీ వర్షాలు పడవని, హైదరాబాద్ వంటి నగరంలో క్యుములో నింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

క్యుములోనింబస్ మేఘాలతో...

తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణలో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది తొలగిపోయిందని అధికారులు చెబుతున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే తేలికపాటి, మోస్తరు వానలు మాత్రమే పడతాయని, భారీ వర్షాలు పడవని, హైదరాబాద్ వంటి నగరంలో క్యుములో నింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu