Mumbai : ముంబయిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు నేడు పడతాయని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
ముంబయి, పూణె, ధానే నగరాలలో తీవ్ర వర్షపాతం పడుతుందని హెచ్చరించారు.
అప్రమత్తమయిన...కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వాతావరణం అలెర్ట్ తో ముంబయి మహా నగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. నాలాల వద్ద, మ్యాన్ హోల్ మూతల వద్ద జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

