Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rain Alert : వాయుగుండం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వానలు

Rain Alert : వాయుగుండం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వానలు

TeluguPost.com 9 hrs ago

Hyderabad : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు భారీ వర్షాలు పడనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వానలు పడతాయని వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం కూడా అలజడిగా ఉంటుందని చెప్పింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని వెల్లడించింది. బుధవారం తీరంలో చేపల వేటపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. రాగల ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని, రేపు పారాదీప్ - సాగర్ వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశముందని చెప్పింది.

ఏపీలో భారీ వర్షాలు...ఆంధ్రప్రదేశ్ లో వాయుగుండం ప్రభావం కారణంగా భారీ వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు తీరం వెంట బలమైన గాలులు వీస్తాయని, గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వానలతో పాటు గాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు బుధవారం వరకూ చేపల వేటకు వెళ్లవద్దని కోరింది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో వానలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలిక పాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా తీర ప్రాంత వెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గాలులు వీస్తున్న సమయంలో బయటకు రావద్దని హెచ్చరించింది. తేలిక పాటి జల్లులు...ఈరోజు తెలంగాణలోనూ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరి తల ద్రోణి ప్రభావంతో పాటు వాయుగుండం ప్రభావంతో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు తెలంగాణలో పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతోబలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయింది. అయితే ఈ వానలు కూడా పెద్దగా సాగుకు పనికి రావని, అనేక ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu