Dailyhunt
Renuka Choudhary : కుక్కను, కులాన్ని కొంగును కట్టుకుని తిరుగుతున్నావేంటమ్మా?

Renuka Choudhary : కుక్కను, కులాన్ని కొంగును కట్టుకుని తిరుగుతున్నావేంటమ్మా?

TeluguPost.com 3 weeks ago

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నిత్యం వివాదాల్లో చిక్కుకుంటారు. ఆమె వైఖరి అనేక విమర్శలకు తావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలిగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన రేణుకా చౌదరి తరచూ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతున్నారు.

కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ హైకమాండ్ రాజ్యసభ పదవి ఇచ్చింది. రాజ్యసభలో రేణుక తన గళం విప్పి తెలంగాణ సమస్యలను ప్రస్తావించాల్సి ఉంది. అయితే తరచూ వివాదాలకు కారణమవుతున్నారు. ఆ మధ్య కాలంలో కుక్కను పార్లమెంటు ఆవరణలోకి తీసుకెళ్లి తాను ఇంతేనని చెప్పకనే చెప్పారు.

పార్లమెంటు కు కుక్కను తెచ్చి...కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గత ఏడాది డిసెంబరు నెలలో తన కారులో వీధి కుక్కపిల్లను పార్లమెంటు ఆవరణలోకి తీసుకురావడం వివాదాస్పదమైంది. రక్షించిన కుక్కను వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలో పార్లమెంట్‌కు వచ్చినట్లు ఆమె సమర్థించుకున్నారు, అయితే ఈ చర్యపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ కుక్కను లోపలికి తీసుకువచ్చారని బీజేపీ ఆరోపించింది, దీనిపై ప్రివిలేజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. రేణుక చౌదరి మాత్రం లోపల కూర్చున్నవారే కరుస్తారు, కుక్కలు కావు అంటూ ఆమె వ్యాఖ్యానించి మరింత వివాదానికి ఆజ్యం పోశారు. ఈ ఘటన తర్వాత పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి పెంపుడు జంతువులను అనుమతించబోమని సీఐఎస్ఎఫ్ స్పష్టం చేసింది.అమరావతిపై మాట్లాడుతూ...తాజాగా రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుపై మాట్లాడుతూ అమరావతిని సమర్ధించినంత వరకూ ఎవరికీ తప్పులేదు. అలాగే తెలంగాణకు స్టీల్ ప్లాంట్, కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని అడగడంలో కూడా ఎవరూ తప్పుపట్టరు. కానీ తన ప్రసంగంలో కులం ప్రస్తావన తేవడమే రేణుక చౌదరి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి పెట్టరా అమరావతి... పలకరా... కమ్మరావతి అని కులం పేరు తేవడంతో ఇప్పుడు అసలు విషయం పక్కదారి పట్టింది. వైసీపీ సోషల్ మీడియాలో అమరావతిలో తాము చెప్పిందే నిజమంటూ ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన నేతగా ఉన్నరేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్ విషయంలో మద్దతు ఇవ్వడం వరకూ తప్పులేదు కానీ, కులం ప్రస్తావన తెచ్చి విషయాన్ని డైవర్ట్ చేశారు. ఇప్పటికైనా రాజ్యసభలో సమస్యలను గురించి పోరాడు తల్లీ అంటూ కొందరు పోస్టులు పెడుతునునారు. ఆమె చేతలకు, నోటికి హైకమాండ్ కూడా అడ్డుకట్టవేయకపోవడం విచారకరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu