Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెస్టారెంట్ లోకాల్పులు.. నలుగురు మృతి

రెస్టారెంట్ లోకాల్పులు.. నలుగురు మృతి

TeluguPost.com 6 days ago

తుర్కియోలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రెస్టారెంట్ లో తుపాకితో యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

దక్షిణ తుర్కియేలోని మెర్సిన్ సిటీలో ఈ దారుణం జరిగింది. కాల్పులకు పాల్పడిన యువకుడి వయసు 17 ఏళ్లు అని చెబుతున్నారు. టార్సస్ లోని ఒక రెస్టారెంట్ లోకి ప్రవేశించిన ఈ యువకుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.

పలువురికి గాయాలు...కాల్పులు జరిపిన అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో రెస్టారెంట్ యజమానితో పాటు సిబ్బంది, మరో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పుల జరిపిన యువకుడి కోసం గాలిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu