ముఖ్యమంత్రి రేవంత్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. వెంటనే అన్నదాతల నుంచి పంటలను కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రైతులు ఆందోళనలకు దిగుతున్నా ఈ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
రైతుల ప్రాణాలు పోతున్నా...
రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా? అని కేటీఆర్ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కుప్పకూలుతున్నా కనికరించరా? అని కేటీఆర్ నిలదీశారు. ధ్యానం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా? అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

