Telangana : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కావాలనే పోలీసులపై దాడికి యత్నించారని అన్నారు. సభను అడ్డుకుని మూడు రోజుల పాటు ప్రజా సమస్యలపై చర్చ జరగనివ్వకుండా అడ్డుకున్నారని అన్నారు.
మూడు రోజులు వారి ఆందోళనలతోనే సభా సమయం వృధా అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టి పోలీసులపై దాడికి యత్నించారని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
ఉద్యోగ సంఘాలతో రేవంత్...
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బకాయిలు ఇప్పించాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. వెసులుబాటు చూసుకుని అన్నీ చెల్లిస్తామన్న సీఎం రేవంత్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కాస్త ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వాలన్ని ఉద్యోగ సంఘాల నేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎం

