కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నాలుగు కేటగిరీలుగా కార్మికులను విభజించామని రేవంత్ రెడ్డి చెప్పారు.
కనీస వేతనాలను సవరించకపోవడం వల్ల కోటిన్నర మంది కార్మికులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. కార్మికుల శ్రేయస్సు కోరి కనీస వేతనాలను పెంచామని రేవంత్ రెడ్డి తెలిపారు.
జూన్ ఒకటి నుంచి అమలులోకి...
1.11 కోట్ల మంది కార్మికులు ఈ పెంపుదల వల్ల ప్రయోజనం పొందుతారని అన్నారు. జూన్ 1వ తేదీ నుంచి పెరిగిన వేతనాలు అమలులోకి వస్తాయని రేవంత్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉండాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో అర్బన్, రూరల్ రెండు జోన్లుగా ఉండేవని, కానీ నేడు నాలుగు జోన్లగా విభజించామని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని రేవంత్ రెడ్డి తెలిపారు.

