Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Revanth Reddy : మరికాసేపట్లో ప్రధానితో రేవంత్ భేటీ

Revanth Reddy : మరికాసేపట్లో ప్రధానితో రేవంత్ భేటీ

TeluguPost.com 1 day ago

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ భేటీ జరుగుతుంది.

నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానితో జరిగే సమావేశంలో రాష్టానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

కీలక ప్రాజెక్టులపై చర్చ...తెలంగాణ అభివృద్ధి, కీలక ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ రివర్ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశంపై చర్చించనున్నారు. అలాగే మెట్రో రైలు విస్తరణ గురించి కూడా చర్చించే అవకాశముంది. అలాగే ఈరోజు రాత్రి ఏడు గంటలకు కు కేంద్రమంత్రి ఖట్టర్‌తో సీఎం రేవంత్‌ భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu