Telangana : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు రేపు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలను రేవంత్ రెడ్డి జరపనున్నారు.
తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఆయన నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
తెలంగాణ అంశాలపై...తెలంగాణ అభివృద్ధి మరియు పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులను కలవనున్నారు.మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ , రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణపై సంప్రదింపులు జరుపుతారు.మెట్రో రైలు రెండో దశ విస్తరణకు కేంద్ర నిధులు, అనుమతుల సాధన విషయాలపై చర్చించనున్నారు.

