Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Revanth Reddy : పార్టీ లైన్ లో ఉంటే పదవులు..పైరవీలతో రావు

Revanth Reddy : పార్టీ లైన్ లో ఉంటే పదవులు..పైరవీలతో రావు

TeluguPost.com 52 mins ago

Hyderabad : గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వ్యూహాలు మాకు వదిలేయండి.. ఎత్తుగడలు మాకు వదిలేయండి..

కసితో పనిచేయాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరేం చేస్తున్నారో డేటా తమ దగ్గర ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందని, అలాగే పదవులు కూడా అడగకుండా వస్తాయని ఆయన అన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, రెండోసారి కూడా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రతి ఒక్కరూ గెలుపు పై విశ్వాసం ఉంచి పనిచేయాలని, అప్పుడే గెలవగలమని ఆయన అన్నారు.

పేదల ఆత్మబంధువులయితే...పేదలకు ఆత్మబంధువులయితే.. వారే మనకు బంధువులుగా మారతారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్లనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి తాము కూడా వస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవస్థను తయారు చేస్తున్నామని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఉన్న సీట్లు 119 ఇలాగే ఉంటే వచ్చే సారి 90 సీట్లు తెస్తామని, కోటి ఓట్లు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పేదలకు, మహిళకు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ లైన్ లో ఉంటేనే...పార్టీ లైన్ లో ఉంటే పదవులు వస్తాయని, ఢిల్లీలో పరిచయాల వల్ల, పైరవీల వల్ల పదవులు రావని రేవంత్ రెడ్డి నేతలకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలు తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు అవకాశమిస్తూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ పథకమైనా పార్టీల కతీతంగా అందిస్తున్నామని, నేతలు, కార్యకర్తలు అవి ప్రజలకు వివరిస్తే చాలు.. మనదే గెలుపు అని అన్నారు. మంచిని మైకులో చెప్పాలని, చెడును చెవిలో చెప్పాలని రేవంత్ రెడ్డి సూచించారు. కోటి కుటుంబాలక జీవిత బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. జనగణనలో కులగణన చేసి చూపించామని రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 15 స్థానాలు సాధించి రాహుల్ ను ప్రధానమంత్రిని చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu