East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పెరవలి మండలం పిట్టల వేమవరంలో ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు మృతి చెందారు.
బైక్‌ను ప్రైవేట్ అంబులెన్సు ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి చెందారు.
ఇద్దరు మృతి చెందడంతో...మృతులు పిట్టల వేమవరానికి చెందిన నేలపూడి ప్రదీప్ , కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన హరిదాసు సాయిగా పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

