కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మునీరాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో వంతెనపై నుంచి ట్రాక్టర్ కింద పడింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా మరో పది మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వార్త తెలిసిన వెంటనే స్థానికులు సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో...
గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

