Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..  ఇద్దరు మృతి

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

TeluguPost.com 1 day ago

Hyderabad : హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు ఉదయం క్రికెట్ ఆడుకునేందుకు ముగ్గురు యువకులు స్కూటీపై వెళుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.

దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

టిప్పర్ ఢీకొట్టి...మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిని మహేష్ , లక్ష్మీతేజగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu