Dailyhunt
Road Accident : పది రోజుల్లో పెళ్లి.. మృత్యువు కబళించింది

Road Accident : పది రోజుల్లో పెళ్లి.. మృత్యువు కబళించింది

TeluguPost.com 0 months ago

దిరోజుల్లో పెళ్లి ఉండగా వధువు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం...పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.

ఈ నెల 12న వివాహం...

మల్లికార్జునరెడ్డి కి ఈ నెల 12న వివాహం నిశ్చయమవ్వడంతో, పిడుగురాళ్లలో పెళ్లి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మల్లికార్జునరెడ్డి స్పాట్ లోనే మృతి చెందినట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu