Punjab : పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో ఐదుగురి మృతి చెందారు. ఈ ప్రమాదంలో పదకొండు మందికి గాయాలయ్యాయి. పొగమంచు కురుస్తుండటంతో పాటు, అతివేగమే ప్రమాదానికి అసలు కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పదకొండు మందికి గాయాలు...ప్రమాదం జరిగిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

