Andhra Pradesh : బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేతా తెలిపారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నిలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లాల ఎస్సీలు, కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ముందు నుంచే చేసుకోవాలని కోరారు.
బ్యాలట్ పత్రాల ముద్రణకు...ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సిద్ధమైన ఓటర్ల జాబితాను అనుసరించే ఎన్నికలు జరుగతాయని తెలిపారు. బ్యాలట్ పేపర్ ద్వారా ఎన్నికలు ఉంటాయి కాబట్టి అందుకు అవసరమైన బ్యాలట్ బాక్సులను సిద్ధం చేశామని ఎన్నికల అధికారి పునేతా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంటామన్న ఆయన ఎన్నికలను దశల వారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ ను కూడా ఫైనల్ చేస్తామని చెప్పారు.

