సీబీఎస్ఈ ఛైర్మన్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. ఇటీవల సీబీఎస్ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఈ ప్యానెల్ విచారించే అవకాశముంది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్‌తో పాటు, సీబీఎస్ఈ ఛైర్మన్ రాహుల్ సింగ్‌ను పార్లమెంటరీ విద్యా స్థాయీ సంఘం ముందు హాజరుకావాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది.
కొత్తగా ప్రవేశపెట్టిన...సీబీఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై వివాదంతో చర్యలు ప్రారంభించింది. సీబీఎస్ఈ పరీక్షలు, ఫలితాల నిర్వహణలో ఇటీవల తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 12వ తరగతి ఫలితాల వెల్లడిలో, పేపర్ వాల్యుయేషన్, మార్కుల కేటాయింపులో లోపాలు జరిగాయంటూ లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సమన్లు జారీ అయ్యారు.

