కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు అభిజిత్ దీష్కేపై కొందరు దాడి చేశారు.నీట్ పేపర్ లీక్ మరియు నిరుద్యోగానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై కొందరు దుండగులు దాడి చేశారు.
ప్రదర్శనలో ఆయనను మద్దతుదారులు భుజాలపై ఊరేగిస్తుండగా, గుంపులో ఉన్న కొందరు వ్యక్తులు హఠాత్తుగా ఆయనపై దాడి చేసి చెంపదెబ్బలు కొట్టారు.
జైపూర్ లో నిరసన ప్రదర్శన చేస్తుండగా...
కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా, నీట్ పేపర్ లీక్ మరియు పెరుగుతున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సభా వేదిక వద్దకు అభిజిత్ దీప్కే చేరుకున్న సమయంలో, మద్దతుదారులు ఆయనను తమ భుజాలపై ఎత్తుకున్నారు. అదే సమయంలో గుంపులోని కొందరు వ్యక్తులు దీప్కేపై దాడి చేసి, చెంపదెబ్బలు కొట్టారు. వెంటనే అప్రమత్తమైన సీజేపీ కార్యకర్తలు దాడి చేసిన వారిని అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

