సినీ దర్శకుడు భారతీరాజా మృతి చెందారు. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. భారతీ రాజా అనేక తమిళ, కన్నడ భాషల్లో మాత్రమే కాకుండా అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1941 జులై 17వ తేదీన భారతీ రాజా జన్మించారు. ఆయన వయసు 84 ఏళ్లు. ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను భారతీ రాజా అందుకున్నారు. పద్మశ్రీ అవార్డును 2004లో భారతీ రాజా పొందారు. ఎందరో ప్రముఖ నటులను ఆయన వెండి తెరకు పరిచయం చేశారు కమల్ హాసన్, రజనీకాంత్ లకు మంచి హిట్ సినిమాలు అందించి ఇండ్రస్ట్రీలో నిలబెట్టారు.
అనేక అవార్డులు.. రివార్డులు...తమిళనాడులో అత్యధిక విజయాలు సాధించిన సినిమాలకు భారతీ రాజా దర్శకత్వం వహించారు. సీతాకోక చిలక, ఆరాధన సినిమాలకు భారతీ రాజాకు జాతీయ అవార్డులు లభించాయి. భారతీ రాజా దర్శకుడిగానే కాకుండా రచయితగా, నటుడు, నిర్మాతగానూ భారతీ రాజా వ్యవహరించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించాలని ప్రతి ఒక్క నటుడూ కోరుకుంటారు. భారతీ రాజా మరణంతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

