Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిట్ అధికారులకు బండి భగీరథ్ లేఖ

సిట్ అధికారులకు బండి భగీరథ్ లేఖ

TeluguPost.com 1 week ago

బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సిట్ అధికారులకు లేఖ రాశారు. తాను విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం కావాలని కోరారు. తనకు నోటీసు అందిందని, విచారణకు సహకరించడానికి, అలాగే దానికి సంబంధించి తన నుంచి పూర్తి సంసిద్ధతను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

తాను అధికారి ముందు హాజరై, కోరిన విధంగా దర్యాప్తుకు సహకరిస్తానని బండి భగీరథ్ పేర్కొన్నారు.

రెండురోజుల సమయం...

తనకు చాలా తక్కువ వ్యవధిలో నోటీసు ఇచ్చినందున కొన్ని వ్యక్తిగత అసౌకర్యాల కారణంగా..నోటీసులో నిర్దేశించిన తేదీన తాను హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. అందువల్ల తన పైనా తన కుటుంబంపైనా చేసిన తప్పుడు ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తుకు అర్థవంతంగా సహాయపడే తన వద్ద ఉన్న సంబంధిత సామాగ్రి, పత్రాలు మరియు సమాచారాన్ని సమీకరించుకోవడానికి వీలుగా, నోటీసులో నిర్దేశించిన తేదీ నుంచి రెండు రోజుల గడువును బండి భగీరథ్ కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu