ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీకి మనదేశానికి చెందిన ప్రసిద్ధ 'పార్లే మెలోడీ' చాక్లెట్లను బహుమతిగా అందించారు.
దీనిని అందుకున్న మెలోనీ తనకు ప్రధాని నరేంద్ర మోదీ అపరూపమైన,తీయని బహుమతిని ఇచ్చారని తెలిపారు.
సరదాకానుకగా...ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారిద్దరి జోడీని 'మెలోడీ' అని పిలవడంతో, దాన్ని గుర్తుచేస్తూ మోదీ ఈ సరదా కానుకను ఇచ్చారు. ఈ స్వీట్ సర్ప్రైజ్ పట్ల జార్జియా మెలోనీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు

