Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srisailam : శ్రీశైలంలో నాలుగు రోజులు స్పర్శ దర్శనాలు నిలిపివేత

Srisailam : శ్రీశైలంలో నాలుగు రోజులు స్పర్శ దర్శనాలు నిలిపివేత

TeluguPost.com 3 weeks ago

శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులతో పాటు వరస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ నాలుగు రోజులపాటు స్పర్శ దర్శనాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఒక్కసారిగా భక్తులు తరలి రావడంతో దర్శనానికి గంటల సమయం పడుతుంది.

ముందుగా బుక్ చేసుకున్న...ముందుగా ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. నాలుగు రోజుల పాటు కేవలం సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అలంకార దర్శనానికే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu