Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Subhodh Singh : వీడి కళ్లు పడ్డాయో.. ఇక అంతే...లూటీ చేయడంలో చేయితిరిగినోడు

Subhodh Singh : వీడి కళ్లు పడ్డాయో.. ఇక అంతే...లూటీ చేయడంలో చేయితిరిగినోడు

TeluguPost.com 4 months ago

సుభోధ్ సింగ్ కేవలం.. బంగారాన్ని మాత్రమే దొంగతనం చేస్తాడు. దోపిడీకి పాల్పడతాడు. బీహార్ కు చెందిన సుభోద్ సింగ్ ప్రత్యేకంగా తనకంటూ ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని అనేక రాష్ట్రాల్లో బంగారం దుకాణాలతో పాటు అనేక ఇళ్లలో చోరీలు చేసినట్లు గుర్తించారు.

ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన జ్యుయలరీ దుకాణం దోపిడీ కేసులో సుభోధ్ సింగ్ ప్రధాన నిందితుడు. ప్రస్తుతం అరెస్టయి కరీంనగర్ జైలులో ఉన్నాడు. కరడు గట్టిన నేరగాడు అయిన సుభోధ్ సింగ్ పై అనేక రాష్ట్రాల్లో దోపిడీలు, హత్య కేసులు నమోదయ్యాయంటే వీడు ఏ రేంజ్ లో దోపిడీ చేస్తాడన్నది అర్థమవుతుంది.

అనేక రాష్ట్రాల్లో దోపిడీలు.. హత్యలు...

ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. సుభోధ్ సింగ్ క్రిమినల్ హిస్టరీ వింటేనే దడ పుడుతుంది. ఇప్పటి వరకూ సుభోద్ సింగ్ బ్యాంకులు, జ్యుయలరీ దుకాణాలు, ప్రయివేటు వ్యాపార సంస్థల్లో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సుభోధ్ సింగ్ నేటి వరకూ నాలుగు వందల కిలోల బంగారాన్ని దోచుకెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. కేవలం బంగారాన్ని మాత్రమే టార్గెట్ చేస్తాడు. మిగిలిన వస్తువులను ముట్టుకోడంటే ముట్టుకోడు. ఇతని నేరాల శైలి కూడా భిన్నంగా ఉంటుంది.

గ్యాంగ్ తో వెళ్లి...

నేరుగా దుకాణాలకు వెళ్లడం తుపాకులతో తన గ్యాంగ్ లతో బెదిరించడం, అవసరమైతే కాల్పులు జరపడం, ఇంకా అత్యవసరమైతే హత్యలు చేయడం సుభోధ్ సింగ్ కు వెన్నతో పెట్టిన విద్య. ప్రాణాలను సులువుగా తీస్తాడు. బంగారం కోసం ఏదైనా చేస్తాడు. కొల్లగొట్టిన బంగారాన్ని బీహార్ లోని జ్యుయలరీ దుకాణాలకు విక్రయిస్తాడు. తాను జైలులో ఉన్నప్పటికీ తన గ్యాంగ్ తో దోపిడీలను యధేచ్ఛగా జరిపిస్తున్నాడు. స్కెచ్ వేసి తన గ్యాంగ్ ను పంపడం, దోపిడీ చేయడం, దొరికినంత దోచుకుని అనేక రాష్ట్రాలు తిరిగి చివరకు బీహార్ కు చేరుకోవడం వంటివి చేస్తారు. కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న సుభోధ్ సింగ్ ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు న్యాయస్థానంలో పిటీషన్ వేశారు ఈ పిటీషన్ పై సోమవారం విచారణ జరగనుంది. సుభోధ్ సింగ్ ను సెంట్రల్ జైలుకు తరలించేందుకు కూడా పోలీసులు పిటీషన్ వేయనున్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu