ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత రానురాను ఎక్కువవుతుంది. సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. వేడిగాలులు, ఉక్కపోత ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి.
మరొకవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా వానలు కూడా పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి వేళ ఉష్ణోగ్రతలు, సాయంత్రానికి వాతావరణంలో మార్పులు వస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత ...ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు, కోస్తాంధ్రలోని పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో 43 నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో పిడుగులతో కూడిన వానలు పడతాయని కూడా చెప్పింది. 19 జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో భిన్న మైన వాతావరణం...తెలంగాణలోనూ భిన్న మైన వాతావరణం నెలకొంది. పగటి వేళ ఎండల తీవ్రత, సాయంత్రం వేళ వానలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రానురాను ఎండల తీవ్రత మరింత పెరగనుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో సాయంత్రానికి వానులు పడతాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశముందని చెప్పింది. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పింది.

