Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Supreme Court : టెట్ పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court : టెట్ పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు

TeluguPost.com 3 weeks ago

ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ రాసి నిర్ణీత సమయంలో అర్హత సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులైన, ఇంకా ఐదేళ్లకుపైగా సర్వీస్ ఉన్న టీచర్లు రెండేళ్లలోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని 2025 సెప్టెంబరు 1న తాను ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.

అర్హత గడువు...కానీ టెట్ అర్హత సాధించడానికి వారికి ఇదివరకు ఇచ్చిన రెండేళ్ల గడువును మూడేళ్లకు పెంచింది. అంటే ఇదివరకు 2027 ఆగస్టు 31 వరకు విధించిన గడువును ఇప్పుడు 2028 ఆగస్టు 31కి పొడిగించింది. ఈ ఒక్క ఉపశమనం మినహా పాత తీర్పు అంతా యథావిధిగా అమలులో ఉంటుందని జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu