స్వీడన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. యువరాణి విక్టోరియా, స్వీడన్ ప్రధానితో మోదీ భేటీ కానున్నారు. స్వీడన్ దిగ్గజ కంపెనీల సీఈవోలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు.
భారత్‌లో పెట్టుబడులకు ఆహ్వానించిన మోదీ పెట్టుబడులకు భారత్ అనుకూలమైనదని వారికి వివరించారు.
పెట్టుబడులకు...మేక్ ఇన్ ఇండియా,నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగస్వాములు కావాలని స్వీడన్ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ వినతి పత్రాన్ని అందించనున్నారు. రక్షణ రంగం, సెమీ కండక్టర్, డిజిటల్ టెక్నాలజీలో పరస్పర సహకారంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు.

