తాడిపత్రిలో ఉరుములు మెరుపులతో వాన, గాలి బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు పుట్లూరు రోడ్డు సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు నేలకొరిగిన చెట్లు.. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
తెల్లవారుజామున రెండు గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ట్రాఫిక్ జామ్ తో...ట్రాఫిక్ జామ్ తో పాటు పలుచోట్ల వాహనాలను పోలీసులు మళ్లిస్తున్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను తొలగిస్తున్నారు. ఎండాకాలంలో ఉన్నట్లుండి భారీ వర్షాలతో ఈదురుగాలులు వీయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

