Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాడిపత్రిలో మరోసారి టెన్షన్

తాడిపత్రిలో మరోసారి టెన్షన్

TeluguPost.com 4 hrs ago

నంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. జేసీ, కేతిరెడ్డి వర్గాలు ప్రదర్శనకు దిగడంతో పోలీసులు ఇరువురిని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వైసీపీ వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ పోలీసులు, పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులపైకి వైసీపీ శ్రేణులు దూసుకెళ్లారు. దీంతో పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు.

జేసీ ని అడ్డుకున్న పోలీసులు...

మరొకవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు వెళుతున్న జీసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతోమాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు సిద్ధమై అనుచరులతో వెళ్తున్న జేసీ ప్రభాకరరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి జేసీ ప్రభాకరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చేది లేదన్న జేసీ ప్రభాకరరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు భద్రత కల్పించడంపై మండిపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu