Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TDP : వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?

TDP : వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?

TeluguPost.com 6 hrs ago

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చే ఎన్నికల నాటికి మారబోతున్నాయా? అంటే ఇదే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏపీపై ప్రభావం చూపుతాయా?

అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో బీజేపీకి గ్యాప్ వచ్చినప్పటికీ నష్ట నివారణ చర్యలు ముందుగానే చేపట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కారణమయ్యాయి. అందులో నిజానిజాలు లేకపోవచ్చు. ఎందుకంటే ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ వంటి చోట బీజేపీ అంత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి.

టీఎంసీ ఎంపీలు వస్తుండటంతో...పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను ఇరవై మంది వరకూ బీజేపీ తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకిఆ అవసరం ఉండదన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. గత పార్లమెంటు ఎన్నికల్లో 240 స్థానాలు మాత్రమే బీజేపీ సాధించడంతో బీహార్ లో జేడీయూ, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సహకారంతో కేంద్రప్రభుత్వం సాఫీగా సాగుతుంది. అయినా మొన్నామధ్య డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్ బిల్లులు పార్లమెంటులో వీగిపోయాయి. అయితే టీఎంసీ ఎంపీలు ఇరవై మంది వస్తే టీడీపీ అవసరం లేదన్నది వైసీపీ సోషల్ మీడియా నుంచి వినిపిస్తున్న వాదన.టీడీపీ అవసరం...ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి పదహారు పార్లమెంటు స్థానాలున్నాయి. వైసీపీకి మూడు పార్లమెంటు స్థానాలున్నాయి. ఎన్డీఏలో టీడీపీ ఎటూ భాగస్వామి. వైసీపీ బీజేపీతో తప్ప కాంగ్రెస్ తో కలవదు. అయినా ఇంకా మూడేళ్లు సాధారణ ఎన్నికలకు సమయం ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఎన్నో బిల్లులు పార్లమెంటు ముందుకు వస్తాయి. అందుకు టీడీపీ అవసరం ఉంటుంది. అలాగే వచ్చే సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అప్పుడు టీడీపీ అవసరం పడవచ్చు. ఏపీలో బీజేపీకి సొంత బలం లేదు. వైసీపీ నేరుగా పొత్తు పెట్టుకోదు. దీంతో మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే టీఎంసీ నేతలు వచ్చినా.. తాత్కాలికమే. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు టీడీపీతోనే సాధ్యమవుతాయని పార్టీ కేంద్ర నాయకత్వం ఖచ్చితంగా నమ్ముతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu