Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో భూముల ధరల పెంపు :  పొంగులేటి

తెలంగాణలో భూముల ధరల పెంపు : పొంగులేటి

TeluguPost.com 1 week ago

తెలంగాణలో త్వరలో భూముల ధరల పెరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎకరం భూమి కనీసం పదిహేను లక్షలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధి ప్రామాణికంగా ధరలు పెంపు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు.

గత ప్రభుత్వం పెంచినట్లుగానే...అరవింద్ సుబ్రహ్మణ్యం నివేదిక ఆధారంగా గత ప్రభుత్వం రెండుసార్లు భూముల ధరలు పెంచిందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2022 నుంచి భూములు ధరలు పెంచలేదని గుర్తు చేశారు. భూముల ధరలు పెరుగుతాయని దానితో పాటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ పరంగా ఆదాయం కూడా లభిస్తుందని చెప్పారు. వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నామని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu