Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana: మద్యం ప్రియులకు షాక్... ఎంత పెరుగుతాయంటే?

Telangana: మద్యం ప్రియులకు షాక్... ఎంత పెరుగుతాయంటే?

TeluguPost.com 3 days ago

తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇవ్వనుంది.తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ తర్వాత ఈ మద్యం ధరలు అమల్లోకి రానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో విక్రయించే అన్ని రకాల మద్యం బ్రాండ్లపై కనీసం 10 శాతం నుండి 15 శాతం మేర ఈ ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచు కోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతు న్నట్లు తెలుస్తుంది,

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో...

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆమాంతం పెరిగాయి. దీంతో మద్యం సీసాల తయారీకి అవసర మైన ఎల్పీజీ సహజ వాయువు కొరత ఏర్పడింది. గ్లాస్ బాటిళ్లు, రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్స్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో తాము నష్టపోతున్నామని, ధరలను సవరించా లని డిస్టిలరీలు, బ్రేవరీస్ కంపెనీలు గతేడాది కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచడంతో ఈ నిర్ణయం తీసు కున్నట్లు తెలుస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu