Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana : నేడు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Telangana : నేడు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

TeluguPost.com 5 days ago

ఢిల్లీ వేదికగా నేడు స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ​రాష్ట్రం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బయలుదేరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

స్వచ్ఛభారత్ మిషన్...దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రులతో ఈ కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం ఇప్పటికే కేంద్ర మంత్రికి అధికారికంగా సమాచారం అందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu