Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana : నేడు గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం

Telangana : నేడు గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం

TeluguPost.com 1 week ago

రోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పార్టీ ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్ననున్నారు.

ప్రధానంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో తమ పార్టీకి చెందిన ఓట్లకు తొలగించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై...

మరొకవైపు ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ లు హాజరయ్యారు. పీసీసీ ఎంపిక చేసిన 60 మందికి మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముగింపు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu