నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లోకి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలీసు తదితర యూనిఫామ్ సర్వీస్ లకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గరిష్ట వయోపరిమితిని...తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ఠ వయోపరిమితిని పదేళ్ల పాటు సడలించారు. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 44 ఏళ్ల వయసు వరకూ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

