Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana : రాజీవ్ కు రేవంత్ నివాళులు

Telangana : రాజీవ్ కు రేవంత్ నివాళులు

TeluguPost.com 3 days ago

మాజీ ప్రధాని రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.

రాజీవ్ గాంధీ దేశంలోనే కంప్యూటర్ విప్లవానికి నాంది పలికారన్నారు. భారత దేశానికి గుర్తింపు తెచ్చింది రాజీవ్ గాంధీ అని అన్నారు. తన తల్లి మరణంతో ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు.

మహిళలకు రాజకీయాల్లో...

మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజీవ్ గాంధీ ఆకాంక్షించారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ దార్శనికతను ప్రపంచానికి చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన ఘనత రాజీవ్ గాంధీదేనని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu