Hyderabad : తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేత హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపణలపై చర్చించడానికి హరీశ్ రావు గన్ పార్క్ కు బయలుదేరారు.
అయితే తాను చర్చించడానికే వెళుతున్నానని, అనుమతించాలని పోలీసులను కోరారు.
గన్ పార్క్ కు వెళ్లేందుకు...
ఈ సమయంలో హరీశ్ రావు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ లకు మీడియా సమక్షలంలో ఫోన్ లు చేశారు. కానీ వారు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడంతో హరీశ్ రావు కాలినడకన గన్ పార్క్ కు వెళ్లేందుకు బయలుదేరడంతోపోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో హరీశ్ రావు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో వాహనంలోకి ఎక్కించారు.

