Andhra Pradesh : తూర్పుగోదావరి జిల్లాలో పులి కదలికలు కనిపించాయి. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో పులి కదలికలు కలకలం సృష్టించాయి. కరకపాడు-నందిగూడెం అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించినట్లు తెలిపారు.
పులి పాదముద్రలను...పులి పాదముద్రలను పరిశీలించిన అటవీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, అలాగే పశువులను కాచే వాళ్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారుల సూచిస్తున్నారు.

