తిరుమలలో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.. వేసవి సెలవుల కారణంగా ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రెండు మూడు రోజులుగా భక్తులు భారీగా తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.
ఎస్.ఎస్.డి. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది.ఈ క్రమంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూలైన్‌లోకి రావాలని చెప్పారు. టీటీడీ ప్రకటన తర్వాత భక్తులు పీఏసీలకు వెళ్లిపోయారు.. అలాగే రద్దీ కారణంగా సీఆర్వో ఆఫీస్ దగ్గర భక్తులు క్యూ కట్టారు. కళ్యాణకట్టలో కూడా భక్తుల కనిపిస్తోంది.. భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా...తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, మెయిన్ రోడ్లు, పార్కింగ్ ఏరియా ప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.. అక్కడ భక్తుల రద్దీని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తుల కోసం.. శ్రీవారి సేవకుల సాయంతో తాగు నీరు, పాలు, అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. అలాగే కొండపై రద్దీని గమనించి భక్తులు తిరుమలకు రావాలని సూచనలు చేస్తున్నారు.శ్రీవారి సేవా సదన్ వరకూ...తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. శీఘ్రదర్శనం టోకెన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న స్వామి వారిని 79,603 మంది భక్తులు దర్శించుకున్నారు. 45,125 మంది భక్తులు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్లు వచ్చింది.

