Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tirumala : శనివారం.. తిరుమల..ఇక చెప్పాల్సిన పనేముంది?

Tirumala : శనివారం.. తిరుమల..ఇక చెప్పాల్సిన పనేముంది?

TeluguPost.com 0 months ago

తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి వేసవి రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూ లైన్ బయట వరకూ విస్తరించింది.

కిలో మీటర్ల మేర భక్తులు స్వామి దర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తున్నారు. పరీక్షల ఫలితాలు రావడంతో పాటు వేసవి సెలవులు కొనసాగుతుండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే ఎంత మంది వచ్చిన దర్శనం చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులోనూ శనివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

తిరుమలలో పార్కింగ్ కు...

వేసవి రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమలకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని తిరుమల దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు. సొంత వాహనాల్లో వచ్చిన వారు ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుందని, నిదానంగా, నిర్దేశించిన వేగానికి మించి రావద్దని చెబుతున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమలలో పార్కింగ్ సమస్య కూడా తలెత్తుతుందని, దీనిని అధిగమించేందుకు దిగువ తిరుపతి లో వాహనాలను ఉంచి దేవస్థానం బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.

బాట గంగమ్మ ఆలయం వరకూ...

ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ కొన్ని కిలోమీటర్ల మేరకు క్యూ లైన్ విస్తరించింది. బాట గంగమ్మ ఆలయం వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన క్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,008 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారికి 31,444 లక్షల మంది తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu