Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గతంతో పోల్చుకుంటే గురువారం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నిన్నటి వరకూ వేసవి రద్దీతో కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. స్వామి వారి దర్శనం కోసం గంటల కొద్దీ నిరీక్షణ చేయాల్సి వచ్చింది. తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువగా తమిళనాడుతో పాటు ఉత్తర భారత దేశం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో తరలి రావడంతో భక్తులతో తిరుమల కిటకిట లాడిపోతుంది. మాడ వీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి.
నిన్నటి తో పోల్చుకుంటే...అయితే గురువారం మాత్రం భక్తుల రద్దీ కొంత వరకూ తగ్గింది. అయితే నిన్నటితో పోల్చుకుంటే కొంత వరకూ రద్దీ తగ్గింది. పాఠశాలలు ప్రారంభమయినప్పటికీ ఇంకా తరగతులు పెద్దగా జరగకపోతుండటంతో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. వసతి గృహాల కొరత కూడా నిన్నటి వరకూ దొరకడం కష్టంగా మారింది.కానీ నేడు కొంత సులువుగా మారిందని తిరుమల దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఎంత మంది వచ్చినప్పటికీ అవసరమైన చర్యలు తీసుకుంటామని, సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్న ప్రసాదానికి...ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయ టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,067మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,158 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. నిన్న లడ్డూ అమ్మకాలు 4.16 లక్షలుగా ఉందని అధికారులు తెలిపారు. నిన్న అన్నప్రసాదాన్ని 1.93 లక్షల మంది స్వీకరించారని అధికారులు వెల్లడించారు.

