భారత్ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది. అమెరికా ఆంక్షల మినహాయింపుతో సంబంధం లేకుండా రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తామని ప్రకటించింది. రష్యా ముడి చమురు సేకరణకు అమెరికా మినహాయింపు పొడిగింపును భారత్ కోరిందని బ్లూమ్ బెర్గ్ నివేదించిన కొద్ది రోజులకే, ఈ కీలక ప్రకటనను పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.
చమురు కొనుగోళ్లులో...
భారత్ చమురు కొనుగోళ్లు ప్రధానంగా వాణిజ్యపరమైన లాభాపేక్ష, ఆర్థిక సాధ్యతపై ఆధారపడి ఉంటాయని శర్మ నొక్కి చెప్పారు. దేశానికి తగినంత ముడి చమురు నిల్వలు లభించాయని, కొరత లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. వాషింగ్టన్ మొదట మార్చిలో రష్యా చమురు దిగుమతులపై మినహాయింపును ఆమోదించింది. ప్రపంచ ఇంధన సరఫరాలో ఇబ్బందులు కారణంగా తాము రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పింది.

