తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విజయ్ తలపల్లి జోసెఫ్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వ్యక్తి. ఏపీ నుంచి వలస వెళ్లిన కుటుంబం.
విజయ్ తాత అప్పటి మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో రామేశ్వరానికి వలస వెళ్లారు. అక్కడే చేపల వ్యాపారం చేస్తూ స్థిరపడి, మత్స్యకార కుటుంబానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. అయితే విజయ్ తాతకు అది రెండో వివాహం. వారిద్దరికి చంద్రశేఖర్ జన్మించారు. చంద్రశేఖర్ తమిళ చిత్ర పరిశ్రమలో రచయితగా మారి అక్కడ పరిచయం అయిన శోభను వివాహం చేసుకున్నారు. శోభ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు.ఇద్దరిదీ ప్రేమ వివాహం. వారిద్దరి సంతానమే జోసెఫ్ విజయ్.
చిత్తూరు జిల్లాకు చెందిన...
జోసెఫ్ విజయ్ తాత చిత్తూరు జిల్లా మాదిగ కుటుంబానికి చెందిన వారు. తాత వారసత్వంగా విజయ్ క్రైస్తవ మతం స్వీకరించారు. జోసెఫ్ విజయ్ గా మారారు. విజయ్ చిన్న నాటి నుంచి క్రైస్తవ మతానికి ఆకర్షితుడై ఇంటర్ చదివే రోజుల నుంచి చర్చిలకు వెళ్లి ప్రార్థనలకు హాజరయ్యేవారు. అందుకే విజయ్ ఈ ఎన్నికల్లో మతం సమానత్వం అని ప్రకటించుకుని జనం ముంందుకు వెళ్లారు. దేశంలోనే విజయ్ మూడవ దళిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న కులవివక్షను గుర్తించిన విజయ్ పరిశ్రమలో తాను తిరుగులేని హీరోగా నిలదొక్కుకోవాలనుకున్నారు. అహర్నిశలూ శ్రమించి హీరోగా మారి.. దళపతి అయ్యారు.
వెనుదిరిగి చూడని విజయ్...
తొలినాళ్లలో చిత్ర పరిశ్రమలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ విజయ్ వెనుదిరిగి చూడలేదు. తన కష్టాన్ని నమ్ముకున్నారు. ఎందరు అవమానించినా తన గోల్ ను మాత్రం వదలలేదు. హీరోగా మారి వరస హిట్లు కొట్టి మొత్తం 68 సినిమాల్లో నటించారు. పేర ప్రతిష్టలతో పాటు కోట్లాది రూపాయలు వెనకేసుకున్న విజయ్ తనను ఆదరించిన తమిళ ప్రజలకు ఏదో ఒకటిచేయాలని భావించారు.అందుకే ఆయన తర్వాత లక్ష్యం తమిళనాడు ముఖ్యమంత్రిగా మారడమే. అందుకు సమయం కూడా కలసి వచ్చింది. తమిళనాడులో కరుణానిధి, జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఉందని విజయ్ పసిగట్టాడు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ పార్టీ పెట్టి మళ్లీ వెనక్కు తగ్గినా తాను మాత్రం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఎవరితో కలవకూడదని, ఒంటరిగా పోటీ చేసి మరో టార్గెట్ రీచ్ అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యేందుకు మరో ఎనిమిది స్థానాలు వెనకబడినప్పటికీ విజయ్ మాత్రం గురి చూసి తన గోల్ ను ఛేదించాడు. అందుకే దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. హ్యాట్సాప్ టు విజయ్... ఆ ధైర్యం.. సాహసం కొందరికే ఉంటాయి. అందులో విజయ్ ఒకరు.

