Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vaibhav Surya Vamshi : టీం ఇండియా టీ20 కి ఇక "వైభవ"మే

Vaibhav Surya Vamshi : టీం ఇండియా టీ20 కి ఇక "వైభవ"మే

TeluguPost.com 4 months ago

టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు ఇక తిరుగులేదని పిస్తుంది. చాకుల్లాంటి యువ ఆటగాళ్లు వస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో చూపించిన జోరుతో టీ20 వరల్డ్ కప్ లో ఇండియాకు తిరుగులేదనిపిస్తుంది.

మరొకవైపు సాయిసుదర్శన్, జురెల్, అభిషేక్ శర్మ ఇలా టీ20లలో భారత్ మరింత పటిష్టమైందని చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే అతి పెద్ద రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. వరసగా సెంచరీలను తృటిలో మిస్ చేసుకున్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. వైభవ్ వంశీ 1,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్నాడు. కేవలం 440 బంతుల్లోనే 1,000 పరుగుల ఘనత

సిక్సర్లతో అదరగొట్టి...

రాజస్థాన్ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. కేవలం 440 బంతుల్లోనే 1,000 పరుగులు పూర్తి చేసి టోర్నీ చరిత్రలో ఆ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం ఆండ్రే రస్సెల్ 545 బంతుల్లో నెలకొల్పిన రికార్డును అతడు అధిగమించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో 15 ఏళ్ల ఎడమచేతి బ్యాటర్ సూర్యవంశీ మరోసారి మెరిశాడు. జట్టు వరుసగా వికెట్లు కోల్పోతున్నా ఒంటరి పోరాటం సాగించాడు. 47 బంతుల్లో 86 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. 204.26 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

దిగ్గజ ఆటగాళ్ల సరసన...

ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు, 16 ఇన్నింగ్స్‌ల్లో సూర్యవంశీ 776 పరుగులు సాధించాడు. సగటు 48.50. స్ట్రైక్‌రేట్ 237.30. ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోరు 103. మొత్తం 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన సీజన్‌ల జాబితాలో ఇది ఐదో స్థానం. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ , శుభ్‌మన్ గిల్ , జోస్ బట్లర్ , డేవిడ్ వార్నర్ ముందున్నారు.సూర్యవంశీ ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు, 23 ఇన్నింగ్స్‌ల్లో 1,028 పరుగులు చేశాడు. సగటు 44.69. స్ట్రైక్‌రేట్ 228.95. రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోరు 103. ఇన్నింగ్స్‌ల పరంగా కూడా అతడు రెండో అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌ల్లో 1,000 పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు షాన్ మార్ష్ 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకుని అగ్రస్థానంలో ఉన్నాడు.ఒకే ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో 500కిపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. పవర్‌ప్లేలోనే 521 పరుగులు చేసి 233.33 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu